Sridevi Passes Away : శ్రీదేవి నీటిలో మునిగి? అంతా ఆ 30 నిమిషాల్లోనే.. ?

Filmibeat Telugu 2018-02-26

Views 3.5K

According to a report Boney went back to Dubai. In fact, Sridevi was getting ready for a dinner date with him when the tragedy occurred. Boney flew down to Dubai from Mumbai and went to Sridevi's room at the Jumeirah Emirates Towers Hotel at around 5.30pm to surprise her. They had a brief conversation before he asked her to have dinner with him. Sridevi went to the washroom to freshen up.

గ్లామర్ క్వీన్ శ్రీదేవి ఆకస్మిక మరణంతో సినీలోకం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఆదివారం ఉదయమే అభిమానులను, సినీ ప్రముఖులను ఈ వార్త కుదిపేసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగిందనే విషయం గురించి దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్ ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. అదేమిటంటే..
శ్రీదేవికి షాకిద్దామని పెళ్లి తర్వాత బోనికపూర్ తన కూతురు ఖుషీకపూర్‌తో కలిసి దుబాయ్ నుంచి ముంబైకి వచ్చారు. ఆ తర్వాత చిన్నకూతురును ముంబైలో వదిలేసిన బోని శ్రీదేవికి సర్ప్రైజ్ ఇచ్చేందుకు ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్లాడు. జాహ్నవి షూటింగ్‌లో బిజీ వల్ల ఆమె ఈ పెళ్లి కి హాజరుకాని సంగతి తెలిసిందే.
అయితే శ్రీదేవి బస చేసిన దుబాయ్‌లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు బోని చేరుకొని ఆమెకు షాకిచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొన్న తర్వాత వారిద్దరూ డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకొన్నారు. దాంతో డిన్నర్ పది నిమిషాల్లో తయారై వస్తానని చెప్పి శ్రీదేవి బాత్రూంలోకి వెళ్లిందట.
బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి 15 నిమిషాలైనా రాకపోవడంతో బోని డోర్ ‌తట్టాడట. అయితే లోనుంచి ఏలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే బాత్‌టబ్‌లోని నీటిలో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటంతో బోని షాక్ గురయ్యాడు. వెంటనే స్నేహితుడికి సమాచారం అందించి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అచేతనంగా పడి ఉన్న శ్రీదేవిని బతికించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాం. కానీ మా ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించాం అని బోని సన్నిహితులు పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form