Sachin Tendulkar First Player To Score 200 in ODIs, On This Day

Oneindia Telugu 2018-02-24

Views 1

Exactly eight years ago, Tendulkar became the first cricketer to score a double hundred in One-Day Internationals as he guided India to a series victory over South Africa, with a game to spare.

ఫిబ్రవరి 24... అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ రికార్డు ప్రపంచ క్రికెట్ స్వరూపాన్నే మార్చివేసింది. భారత అభిమానులు క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ ఈ రికార్డుని నమోదు చేశాడు.
ఆ రికార్డు ఏంటంటే వన్డే క్రికెట్‌‌లో తొలి డబుల్ సెంచరీ. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనత సాధించి క్రికెట్‌లో ప్రపంచ రికార్డుని తన పేరిట లిఖించాడు.
ఈ మ్యాచ్‌లో 147 బంతులను ఎదుర్కొన్న సచిన్‌ 25 ఫోర్లు, 3 సిక్స్‌ర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్‌ 401 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 153 పరుగుల తేడాతో పర్యాటక దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
తొలి సెంచరీని 90 బంతుల్లో సెంచరీ నమోదు చేసిన సచిన్... అనంతరం బ్యాటింగ్‌‌లో వేగం పెంచి కేవలం 57 బంతుల్లోనే మరో వంద పరుగులు బాదాడు. ఇందులో 25 ఫోర్ల ద్వారానే 100 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత ఏడాది టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ (219) పరుగులతో డబుల్‌ సాధించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form