Hardik Pandya Not a All Rounder,Don't Compare With Kapil Dev

Oneindia Telugu 2018-02-23

Views 51

Kapil got hundreds in first-class cricket before he broke into India’s Test side. Pandya hasn’t scored runs in first-class cricket before playing at the top level, Roger Binny says about Pandya


హార్ధిక్ పాండ్యా ప్రదర్శనపై భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ మండిపడుతున్నాడు. అదృష్టవశాత్తు ఆల్ రౌండర్ అని పిలిపించుకుంటున్నాడే తప్ప అతని ప్రదర్శన అంతగా ఏమీ బాగా లేదన్నాడు. అన్ని ఇన్నింగ్స్‌లోనూ బ్యాట్‌తో వరుసగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాని ఆల్‌రౌండర్‌గా ఎలా పిలుస్తారని భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ ప్రశ్నించారు.
బ్యాట్‌తో విఫలమవుతున్నా.. బంతితో ఫర్వాలేదనిపిస్తున్నాడు కాబట్టే.. అతను ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు. టీ20ల్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా టెస్టుల్లోకి రాగలిగాడు. కానీ.. వన్డే, టీ20లతో పోలిస్తే.. ఐదు రోజుల సుదీర్ఘ ఫార్మాట్‌ తీరు వేరనే విషయాన్ని అతను గుర్తించాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొద్దిసేపటికే ఫీల్డర్లు బ్యాట్స్‌మెన్‌కి దూరంగా వెళ్తారు. అప్పుడు పరుగులు సాధించొచ్చు. కానీ.. టెస్టుల్లో అలా కాదు' అంటూ పాండ్యా ఆటతీరును విశ్లేషించాడు
టీ20ల్లో హిట్టింగ్ చేయడం ద్వారానే టెస్టుల్లో హార్దిక్ చోటు దక్కించుకున్నాడే తప్ప.. అతడ్ని ఓ ఆల్‌రౌండర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లి చూడటం లేదన్నాడు. ఇకనైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ద్వారా హార్దిక్ తన ఆటని మెరుగుపర్చుకుంటే మంచిదని బిన్నీ సూచించాడు. హార్దిక్ పాండ్య దక్షిణాఫ్రికా‌తో జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో కేవలం తొలి టెస్టులోనే 93 పరుగులు చేశాడు. మిగిలిన అన్ని ఇన్నింగ్స్‌లోనూ సాధారణ ప్రదర్శన మాత్రమే చేయగలిగాడు'
ఇక గత ఏడాదికాలంగా దిగ్గజ ఆల్‌‌రౌండర్ కపిల్‌దేవ్‌తో హార్దిక్ పాండ్యాని పోల్చుతున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే.. భారత్ జట్టుకి ఆడకముందే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కపిల్‌దేవ్ సెంచరీలు బాదాడు. కానీ.. హార్దిక్ పాండ్య ఫస్ట్ క్లాస్, వన్డే క్రికెట్‌లో కనీసం ఇప్పటి వరకు ఒక సెంచరీ కూడా కొట్టలేకపోయాడు' అని రోజర్ బిన్నీ గుర్తుచేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS