The Andhra Pradesh IAS Officers Association has taken strong exception to the comments held out by YSRCP MP, V. Vijay Sai Reddy against a senior IAS officer.
ఐఏఎస్ అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరడం వెనుక వారి హస్తముందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఐజీ వెంకటేశ్వర రావు తమ బాధ్యతలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో ఆధారాలతో సహా ఐఏఎస్‌ల బాగోతం బయటపెడతానని బాంబు పేల్చారు.
తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు, ఐఏఎస్ అధికారులు ఖండించడంపై విజయ సాయి రెడ్డి తీవ్రంగానే స్పందించారు. అధికారులు ఎంత వరకు వెళ్లినా పర్వాలేదని, తాను అంతవరకు వెళ్ళేందుకు సిద్ధమని అభిప్రాయపడ్డారు.
సీఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రపై, ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర రావులపై విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం ఇదివరకే ఖండించింది. తాము అధికారంలోకి వస్తే సతీష్ చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతారాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సతీష్ చంద్ర నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని, అమరావతి నుంచి పాలన సాగేలా తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారని శశిభూషణ్ కుమార్ తెలిపారు. అనేక సవాళ్లతో లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు