No Confidence Motion : Undavalli Credits Pawan Kalyan

Oneindia Telugu 2018-02-20

Views 155

Former Rajahmundry MP Undavalli Arun kumar responded on Ysrcrp chief Ys Jagan no confidence motion on Centre governament . vudavalli Arun kumar spoke to media on Tuesday at Rajahmundry.


కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని వైసీపీ ప్రకటించడాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. అయితే వైసీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మాణానికి టిడిపి కూడ మద్దతు ప్రకటించాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.ఈ తరుణంలో అవిశ్వాస తీర్మాణం తెరమీదికి వచ్చింది.కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామ్య ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. అయితే భాగస్వామ్యపార్టీలే కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించడం పట్ల బిజెపి తీరును తెటతెల్లం చేస్తోందన్నారు.
ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏ రకమైన విషయాలను బయట పెట్టనుందో చూడాల్సిన అవసరం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. చట్టంలో చెప్పినవి కేంద్రం ఇవ్వలేదు. చట్టంలోలేనివి ఇచ్చినట్టు బిజెపి నేతలు చెబుతున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.అసెంబ్లీకి వైసీపీ నేతలను పంపి ప్రభుత్వ నుండి సమాచారాన్ని బయటపెట్టేలా ప్రయత్నించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ వైసీపీకి సూచించారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించడం వల్లే ఈ విషయమై మంచి పబ్లిసిటీ వచ్చిందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదని ఆయన పార్టీలకు సూచించారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పినవన్నీ కూడ ఇవ్వలేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS