Chandrababu Naidu strategy on Pawan Kalyan ?

Oneindia Telugu 2017-12-09

Views 693

It was assumed that Andhra Pradesh CM Nara Chandrababu Naidu has suggested Nara Lokesh not speak on Jana Sena chief Pawan Kalyan.

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులను ఆదేశించారు. తన ఆంద్రప్రదేశ్ పర్యటనలో పవన్ కల్యాణ్ చంద్రబాబుపైనా, ఆయన ప్రభుత్వంపైనా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు. కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్‌పై ఆయన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై తాజాగా చర్చ సాగుతోంది. నారా లోకేష్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో జగన్‌తో పొత్తు పెట్టుకోనని పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చునని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని, విమర్సలు చేస్తే ఆటంకం ఏర్పడవచ్చునని ఆయన భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS