Janasena president Pawan Kalyan on Monday Commented On Andhra Pradesh CM Chandrababu Naidu.Pawan Kalyan doubted the corrupt practices of Nara Lokesh could be the reason why Centre stopped taking TDP Government seriously. 'I heard Nara Lokesh had connection to Sekhar Reddy's illegal assets case and Centre began neglecting AP completely since then. Don't know if it's true or not...Just heard it from others,' he commented.
ఐదేళ్లు పాలించే అవకాశం జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎస్.కోట(శృంగవరపుకోట)లోని దేవి గుడి జంక్షన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రలో జనసేన పోరాట యాత్ర సాగగా.. రంజాన్ పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించిన పవన్ సోమవారం నుంచి మళ్లీ తన యాత్రను ప్రారంభించారు.
ఐదేళ్ల పాటు పాలించే అవకాశం జనసేనకు ఇస్తే మళ్లీ ఎప్పటికీ తమనే ప్రజలు కోరుకునేలా పరిపాలన అందిస్తామని పవన్ స్పష్టంచేశారు. ఉత్తరాంధ్రను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. రెచ్చగొడుతున్నారని అంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
#pawankalyan
#janasena
#chandrababunaidu
#tdp
#vizianagaram
#srungavarapukota