2.0 ఆలస్యానికి అసలు కారణం ఇదే

Filmibeat Telugu 2018-02-17

Views 2.4K

భారీ గ్రాఫిక్ మాయాజాలంతో వెండి తెర అద్భుతంగా 2.0 చిత్రాన్ని మలచడానికి దర్శకుడు శంకర్ ప్రయత్నిస్తున్నారు. శంకర్ సూపర్ స్టార్ రజినీతో చేసిన రోబో చిత్రం అఖండ విజయం సాధించింది. అంతకు మించేలా 2.0 చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కానీ ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావలసి ఉంది. ఆ తరువాత జనవరిలో అని వార్తలు వచ్చాయి. ఇటీవల ఏప్రిల్ 27 న విడుదల అంటూ ప్రకటించారు. తాజా పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం వేసవిలో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రతిష్టాత్మకంగా శంకర్ 2.0 చిత్రాన్ని ప్రారంభించారు. విజువల్స్ ప్రధానాంశం ఐన చిత్రంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఎక్కువగా ఉంటాయి. గ్రాఫిక్స్ పక్కాగా అనుకున్న విధంగా రాబట్టాలి. దీనితో 2.0 చిత్రం గత ఏడాది దీపావళి నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.
2.0 చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండడం విశేషం.
అసలు 2.0 చిత్రం ఇంతలా వాయిదా పడడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అని మీడియాలో, సినీవర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా వీస్తున్న వార్తలు షాక్ కి గురి చేసేలా ఉన్నాయి. 2.0 చిత్ర యూనిట్ వి ఎఫ్ ఎక్స్ పనులని ఓ విదేశీ సంస్థకు అప్పగించిందట. కానీ ఆ సంస్థ పనులని సకాలంలో పూర్తి చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల తమ సంస్థ దివాళా తీసిందని సదరు కంపెనీ ప్రకటించుకోవడంతో 2.0 చిత్ర యూనిట్ షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS