Actress Roja and Venkatesh have not been on talking terms for 22 years and it hasn't been known for many years even to the industry people as well.
తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్ అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజాతో కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే వీరి మధ్య 22 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఇద్దరి మధ్య లింక్ కట్ అయ్యేలా చేసిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య అసలు మాటలే లేవు. తాజాగా ఓ టీవీ ఛానల్ వారు ఈ విషయాన్ని తెరపైకి తేవడంతో ఆ సంఘటన గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
అసలు విషయానికి వస్తే... రోజా తన భర్త సెల్వమణి తో కలిసి వెంకటేష్ హీరోగా, తాను హీరోయిన్ గా ‘చినరాయుడు' టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకున్నారట కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదనిసమాచారం, ఇది ఇలా ఉండగా అదే చిత్ర కథాంశంతో విజయశాంతితో కలిసి వెంకటేష్ ‘చినరాయుడు' చిత్రంలో నటించారు. దాంతో రోజాకు కోపం వచ్చిందట. ఇలా చేశావేంటి అని వెంకటేష్‌ను రోజా అప్పట్లో నిలదీసిందట. అదంతా నిర్మాతల నిర్ణయమని, తన ప్రమేయం లేదంటూ జారుకున్నారట వెంకటేష్. తర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ‘పోరికి రాజా' అనే చిత్రం వెంకటేష్-రోజా కాంబినేషన్లో వచ్చింది. ఈచిత్రం షూటింగ్ కోసం రోజాను బాంబే తీసుకెళ్లి మూడు రోజుల పాటు ఏ షూటింగ్ లేకుండా హోటల్‌లో ఖాళీగా ఉంచారట. ఏంటని అడిగితే దర్శక నిర్మాతల నుండి సరైన సమాధానం రాలేదట.
అయితే మూడు రోజులు ఖాళీగా ఉన్న రోజా తన భర్త సెల్వమణి బర్త్ డే అని ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లిపోయిందట. 4వ రోజు నుండి షూటింగ్ ప్లాన్ చేసుకున్న నిర్మాతలు రోజా చేసిన పనికి షాకయ్యారట... మీరు వస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటామని చిత్ర బృందం ఎంత చెప్పినా రోజా వినలేదట. తరువాత స్వయంగా వెంకటేష్ ఫోన్ చేసి మాట్లాడినా రోజా వినలేదని, తర్వాత రోజా స్వయంగా వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు రోజా - వెంకటేష్ మధ్య మాటలు లేవని టాక్. సో అదన్నమాట సంగతి.