'అజ్ఞాతవాసి' నుంచి సునీల్ ఔట్ ! కారణం ఇదే..

Filmibeat Telugu 2017-12-28

Views 959

After finishing the script work of Sunil character in Agnyaathavasi, Trivikram and Sunil jointly felt that it is not working out and decided to let it go.

కష్టాల్లో వున్న మిత్రులు ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలవడం సహజం. అందుకే కష్టాల్లో ఉన్న తన మిత్రుడు సునీల్‌ను ఆదుకోవాలని కంకణం కట్టుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. హీరోగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సునీల్‌ను తిరిగి కమెడియన్‌గా మళ్లీ ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్‌తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం ద్వారా సునీల్‌ను మరోసారి పూర్తి స్థాయి కమెడియన్ పాత్రలో చూపించాలనుకున్నాడు. సునీల్ కూడా ఓకె అనడంతో.. ఇక సినిమాలో ఆయన కనిపించడం లాంఛనమే అనుకున్నారంతా. కానీ చివరి నిమిషంలో అంతా తారుమారైంది. ఇంతకీ ఏమైంది..
హీరోగా 2కంట్రీస్ సినిమా చేస్తున్న సమయంలోనే అజ్ఞాతవాసిలోనూ నటించాలని సునీల్ భావించాడు. త్రివిక్రమ్ ప్రతిపాదన మేరకు కథా చర్చల్లోనూ పాల్గొన్నాడు. పూర్తి స్థాయి హాస్య నటుడిగా సునీల్ పునరాగమం అదిరిపోయే రీతిలో త్రివిక్రమ్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు. కానీ..
పూర్తి స్థాయి కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ ఆయన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయే అవకాశం ఉండటంతో త్రివిక్రమ్ చాలానే జాగ్రత్తపడ్డాడట. అందుకు అనుగుణంగానే సునీల్ పాత్ర చుట్టూ కొన్ని సన్నివేశాలు అల్లారట. అయినా సరే.. త్రివిక్రమ్‌కు ఎక్కడో తేడా కొడుతున్నట్లే అనిపించదట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS