Centre Assures Andhra Pradesh Over Special Funds

Oneindia Telugu 2018-02-10

Views 445

NDA government ready to help for Andhra Pradesh state. union minister Sujana chowdary discussed with Bjp national president Amit shah and union minister Arun jaitley, piyush goel on friday night.union ministers were agreed Ap state demands in this meeting.

ఎట్టకేలకు కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్‌లతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన చర్చలు ఫలించాయి.
ఏపీ డిమాండ్లపై కేంద్రం నుండి సానుకూలంగా స్పందించింది. ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీని యధాతథంగా ఇవ్వాలని కేంద్రం అంగీకరించింది. విశాఖకు రైల్వేజోన్ ను ఇచ్చేందుకు కేంద్రం కూడ సానుకూలంగా స్పందించిందని సమాచారం.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి సరైన నిదులు లేవనే విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకుగాను టిడిపి ఎంపీలతో పాటు ఏపీ రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు కూడ పార్లమెంట్ ఉభయ సభల్లో కూడ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే రాజ్యసభలో మూడోసారి కూడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి జైట్లీ ప్రకటన పట్ల కూడ టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే రాజ్యసభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూషీ గోయల్‌లతో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై కేంద్రం ఏ మేరకు వీటిని అమలు చేస్తోందనే విషయమై ఆచరణలో తేలనుంది. త్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్రం హమీ ఇచ్చింది.ఈ హమీ మేరకు ప్రత్యేక ప్యాకేజీని యదాతథంగా అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. ఒప్పందం మేరకు నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రులు హమీ ఇచ్చారని టిడిపి ఎంపీలు చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS