Actress Pooja Hegde will be seen in a special song for actor Ram Charan’s upcoming film Rangasthalam, which is presently being shot at a studio in Hyderabad.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం. చరణ్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చిట్టిబాబుగా రాంచరణ్ తెగ నచ్చేశాడు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశ షూటింగ్ ని జరుపుకుంటోంది. సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అంటే కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఈ చిత్రంలో రాంచరణ్ తో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేయనుంది.
సాధారణంగా స్టార్ హోదాలో ఉన్న హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికి సంశయిస్తారు. అప్పుడప్పుడూ సినిమాకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి హీరోయిన్లు ఐటెం అవతారాలు ఎత్తడం చూస్తూనే ఉన్నాం. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందంటే కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ నెలకొనడం ఖాయం.
దేవిశ్రీ, సుకుమార్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ సూపర్ హిట్ అవడం ఖాయం అనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొని ఉంది. పూజా నర్తించే స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ అద్భుతమైన ట్యూన్ ని సిద్ధం చేసాడట. జిగేల్ రాణి అంటూ ఈ పాట సాగుతుందని సమాచారం.
అలాగే ఇండస్ట్రీలో మెగాస్టార్ తర్వాత బన్నీ, రాంచరణ్‌లు మళ్లీ ఆ స్థాయి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే.. కచ్చితంగా ఫ్యాన్స్ మాస్ మసాలా స్టెప్పులు కోరుకుంటారు. చెర్రీ, బన్నీలు కూడా అభిమానులను నిరాశపరచకుండా ఒక్క పాటైనా తమ స్టెప్పులతో కుమ్మేసేలా ప్లాన్ చేసుకుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు 'సిట్టిబాబు' కూడా తెగ హడావుడి చేసేస్తున్నాడు..