India vs South Africa : Why Virat Kohli is the Greatest Chaser

Oneindia Telugu 2018-02-02

Views 10.2K

Words fail to express when Virat Kohli gets his willow to do the talking. The swashbuckling run machine notched up his 33rd ODI ton to anchor team India home against South Africa in the 1st ODI in Durban on Thursday.
Vaughan tweeted, "He is at is again .. The Greatest chaser the game has ever seen ..

అభిమానులు ఏ ముహూర్తన విరాట్ కోహ్లీకి 'ఛేజ్ మాస్టర్' అని పేరు పెట్టారో తెలియదు గానీ ఆ పేరుకి తగ్గట్లుగానే న్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే లక్ష్య ఛేదనలో కోహ్లీ ఆట తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా డర్బన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ మరో సారి తనదైన షాట్లతో అభిమానులను అలరించాడు. 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి టీమిండియా కెప్టెన్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో 4.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. సఫారీ గడ్డపై టీమిండియా ఛేజ్ చేసిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. తొలి వన్డేలో ఛేదనలో తన సత్తా ఏమిటో కోహ్లీ మరోసారి నిరూపించాడు. అంతేకాదు తొలి వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. సఫారీ గడ్డపై కోహ్లీకి వన్డేల్లో ఇది తొలి సెంచరీ. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య 33కు చేరింది. ఇందులో విరాట్ కోహ్లీ 20 సెంచరీలను ఛేజింగ్‌లోనే సాధించడం విశేషం. 20 సెంచరీల్లో 18 సెంచరీలు జట్టుకు విజయాన్ని అందించాయి. కోహ్లీ తన కెరీర్‌లో మొత్తంలో విదేశీ గడ్డపై 15 సెంచరీలు చేశాడు. కోహ్లీ మాస్టర్ క్లాస్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Share This Video


Download

  
Report form