Virat Kohli scored 160 to power India to 303, Chahal and Kuldeep shared eight wickets as SA were bowled out for 179. after this great victory Virat Kohli & co aim for South Africa Whitewash
సిరిస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని మూడో వన్డే విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'చివరి వరకు ఎవరో ఒకరు బ్యాటింగ్ చేయాలి. ఆ పని కెప్టెన్‌గా నేనే చేయడం సంతోషంగా ఉంది. శిఖర్ ధావన్‌తో చక్కటి భాగస్వామ్యం, చివర్లో భువీ అందించిన సహకారం భారత్ విజయానికి కారణం. చివర్లో కండరాలు పట్టేశాయి. కానీ 300 దాటాలంటే చివరి వరకు నేనుండాలి' అని అన్నాడు.
దక్షిణాఫ్రికాను 6-0తో వైట్ వాష్ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గాను 'ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు. మానసికంగా, శారీరకంగా జట్టుకు ఇదొక పరీక్ష. స్పిన్నర్లతో సఫారీలను ఒత్తిడికి గురి చేయడంలో విజయవంతం అయ్యాం. నాలుగో వన్డేలో ఇంకా పోరాడతాం. ఇక సిరీస్ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు' అని కోహ్లీ తెలిపాడు.