India captain Virat Kohli feels his teammates will need to adopt a similar approach to produce results in their gruelling tour of South Africa up ahead
విదేశీ పర్యటనల్లో కూడా టీమిండియా ఇదే ప్రదర్శన చేయాలని రెండో టెస్టు విజయానంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో పేర్కొన్నాడు. 'నేనిలాగే బ్యాటింగ్ చేయాలని ఆశిస్తున్నా. త్వరగా క్రీజులో నిలదొక్కుకొని చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేస్తే మా బౌలర్లకు తగినంత సమయం దొరుకుతుంది. విదేశీ పర్యటనల్లోనూ మేము ఇదే పద్ధతిని అనుసరించాలి' అని కోహ్లీ అన్నాడు.జట్టు ప్రయోజనం కోసమే భారీ సెంచరీలు చేయాలనుకుంటా. సెంచరీ అనంతరం నిలకడగా ఆడకపోతే వెంటనే రెండు వికెట్లు పడొచ్చు. కొత్త బ్యాట్స్‌మన్ కన్నా క్రీజులో నిలదొక్కుకున్న ఆటగాడు మంచి షాట్లు ఆడగలడు. ఇందులో భాగంగానే నేను ఎక్కువ సమయం క్రీజులో ఉంటా. దీనికి నా ఫిట్‌నెస్ ఎంతగానో సహకరిస్తుంది' అని కోహ్లీ అన్నాడు.టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న పుజారాపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పుజారా నిలకడగా ఆడతున్నాడు. ఇది జట్టుకు ఎంతగానో కలిసొస్తుంది. చాలా రోజుల తర్వాత మురళీ విజయ్ చక్కగా ఆడాడు. ఇక, రెండో టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్ కూడా భవిష్యత్తులో టెస్టుల్లో తాను మంచి పోటీదారు అని నిరూపించుకున్నాడు' అని కోహ్లీ తెలిపాడు.