Kim Jong-un’s former classmates struggle to reconcile their memories of the “good friend” who was obsessed with basketball with the North Korean dictator
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు. వరుసగా అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో ఉత్తరకొరియా పేరును ప్రపంచదేశాల్లో మార్మోగేలా చేస్తున్నాడు. కిమ్ స్కూల్ లో చదువుకొనే సమయంలో పాక్ యున్ అంటూ స్నేహితులు ఆట పట్టించేవారు. కిమ్ తో పాటు చదవుకొన్న కొందరు స్నేహితులు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కిమ్ గురించి వివరించారు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసురుతున్నాడు.
అణ్వాయుధాల శక్తిని పెంపొందించుకొనేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు కిమ్ జంగ్ ఉన్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రకటించారు. అయితే అదే సమయంలో దక్షిణ కొరియాతో చర్చలకు తాము సిద్దంగా ఉన్నట్టు కూడ కిమ్ ప్రకటించడం శుభ పరిణామం. స్కూల్ లో చదువుకొనే సమయంలో కిమ్ ఎలా ఉండేవాడనే విషయమై ఆయన స్నేహితులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
స్విట్జర్లాండ్‌లోని బెర్న్ ప్రాంతంలో ఉన్న జర్మన్ స్పీకింగ్ పాఠశాలలో కిమ్ చదువుకున్నారు.అయితే చిన్నప్పుడు కిమ్‌ను ఆయన స్నేహితులంతా పాక్ యున్ అంటూ సరదాగా ఆట పట్టించేవారు.
బాస్కెట్ బాల్ అంటే ప్రాణమని అయితే కిమ్ కేవలం 5 అడుగుల ఆరు అంగుళాలు మాత్రమే. తన ఎత్తును లెక్క చేయకుండా తనకు ఇష్టమైన ఆట ఆడేవాడని,
స్నేహితులతో ఎప్పుడూ సరదాగా ఉండేవాడని వారు గుర్తు చేసుకొన్నారు. తమ దేశానికి ప్రత్యర్థి దేశాలకు చెందిన విద్యార్థులతో కూడ కిమ్ జంగ్ ఉన్ స్నేహంగా ఉండేవాడని వారు గుర్తు చేశారు.
కిమ్‌కు ఓడిపోవడం అస్సలు నచ్చదని, గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసేవాడని వారు చెప్పారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఒత్తిడికి గురయ్యేవాడని స్నేహితులు గుర్తు చేసుకొన్నారు. కోపమెక్కువ, ఇతరులకు తన వల్ల ఇబ్బందులు ఎదురైనా కిమ్ జంగ్ పట్టించుకోడన్నారు. ఆడవారిపై కేకలు వేసేవాడని వారు గుర్తు చేసుకొన్నారు.