ఇదీ కేసీఆర్ వ్యూహం.. విపక్షం ఊపిరి పీల్చుకోవద్దు..!

Oneindia Telugu 2018-01-15

Views 432

Telangana CM K Chandra Shekhar Rao didn't ready to give sufficient time for elections to opposition parties. In this context Telangana Government has to held panchayat elections in next month. But Present Panchayat Sarpanches tenure upto 2018 July end. In this background government focus on early panchayat elections.

తెలంగాణలో విపక్షాలు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా దెబ్బ కొట్టాలని అధికార పక్షం, ప్రత్యేకించి సీఎం కే చంద్రశేఖర్ రావు తలపోస్తున్నారు. అందులో భాగంగా వచ్చేనెలలోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు. అయితే పంచాయతీలు ఖచ్చితంగా ఐదేళ్ల పదవీ కాలంలో కొనసాగించాల్సి ఉన్నందున.. అప్పటివరకు కొత్తగా ఎన్నికైన వారికి శిక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నది. కొత్తగా ఎన్నికైనవారు శిక్షణ, క్షేత్ర అవగాహన పూర్తి చేసుకొని.. పాత పాలకవర్గాల పదవీకాలం ముగిశాక ఆగస్టు 1వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టేలా చర్యలు చేపడితే చాలునని భావిస్తోంది.
తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని అధికార టీఆర్ఎస్ భావిస్తున్నది. ఈ క్రమంలో సహకార సంఘాల పదవీ కాలాన్ని మరో ఏడాది కాలం పొడిగించే విషయమై మంగళవారం కలెక్టర్లతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా రూపొందించినందున దానిపై చర్చించి, ఆమోదించేందుకు ఈ నెల 22న కేబినెట్‌, 23, 24 తేదీల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జూలై 31తో పంచాయతీల గడువు ముగింపు ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 31వ తేదీతో ముగియనున్నది. అయితే అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలను నిర్వహించుకునే వెసలుబాటు చట్టంలో ఉంది. ఈ మేరకు ముందస్తు పంచాయతీ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని సర్కారు భావిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS