Dinesh Sharma, a BJP candidate from Madhya Pradesh's Dhar, was received with a garland of shoes by a local resident. The incident took place while Sharma was campaigning for the upcoming civic polls in the region. The accused was enraged over scarcity of drinking water.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బిజెపి నేతకు తీవ్రమైన అవమానం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి మెడలో ఓ వ్యక్తి బూట్ల దండ వేశాడు. ఆ షాక్ నుంచి తేరుకున్న అతను సర్దుకునే ప్రయత్నం చేశారు. అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి నేత దినేష్ శర్మ అన్నారు. ఆయను స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్ ధన్మోద్ నుంచి పోటీ చేస్తున్నారు.
తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. ఆ వ్యక్తి పట్టు వీడలేదు. దీంతో బిజెపి నేత చెప్పుల దండ వేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడారు. తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను అలా చేశానని అన్నారు.