Tiger and Disha are waiting for the couple to stop hiding behind the "good friends" tag and just admit to their relationship already, a video of them getting married has surfaced on the internet.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో కాక పుట్టించిన టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మరో సెన్సేషనల్ న్యూస్‌కు ఊతం కల్పించారు. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిన వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే వార్త జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ వార్తపై వారిద్దరూ మౌనం గా ఉండటంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సంవత్సర ఆరంభంలో మాల్దీవుల్లో బికినీలో దిశాపటానీ, సిక్స్‌ప్యాక్ బాడీతో టైగర్ ష్రాఫ్ హల్‌చల్ చేశాయి. వారిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల గురించి మాట్లాడుతుండగానే పెళ్లి వార్త సోషల్ మీడియాను అతలాకుతలం చేస్తున్నది.
న్యూ ఇయర్ వెకేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్లిన వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారనే మాట వినిపిస్తున్నది. అయితే పెళ్లి చేసుకొని అక్కడి వెళ్లారా? అక్కడే పెళ్లి చేసుకొని వచ్చారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ రూమర్లపై వీరిద్దరూ స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
అయితే దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిశా పటానీ మెడలో టైగర్ ష్రాఫ్ పూలదండ వేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. పెళ్లిలో భాగంగా పూలదండ వేశారా లేక ఏదైనా కార్యక్రమంలో ఇది జరిగిందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతున్నది.