Namitha marriage announcement with Veerandra Chowdhary came as a pleasant surprise for her fans. But Namitha tells us that she didn't feel the need to wait for months together to get married once she was sure she had found her soulmate.
దక్షిణ చిత్ర పరిశ్రమలో అగ్రతార వెలిగిన నమిత వివాహం ఇటీవల జరిగింది. కొద్దికాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న నిర్మాత, మోడల్ వీరేంద్ర చౌదరీని నమిత వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం నవంబర్ 24న తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరేంద్రతో పెళ్లి తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన నమిత తన వ్యక్తిగత, దాంపత్య జీవిత విషయాలను వెల్లడించింది.
మా ప్రేమ కథ చాలా సింపుల్. ఎలాంటి ట్విస్టులు లేవు. శశి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా వీరేంద్ర నాకు పరిచయం అయ్యాడు. ఆధ్యాత్మికం, రాజకీయాలను వీరేంద్ర బాగా విశ్లేషిస్తాడు. దాంతో మా మధ్య వేవ్ లెంగ్త్ పెరిగింది.మా స్నేహం బలపడుతున్న సమయంలోనే నాకు తమిళ బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్‌బాస్‌కు వెళ్లమని అతనే ప్రోత్సాహించాడు.