Away from the prying eyes of media and fans, rumoured lovebirds Disha Patani and Tiger Shroff are vacationing in Maldives. Just like the last year, the two decided to ring in the New Year together. Disha and Tiger might not be consciously posting their pictures together, but the two are giving in a sneak-peek into their beach vacation with hot photos .
బాలీవుడ్ ప్రేమ జంట దిశాపటానీ, టైగర్ ష్రాఫ్ మాల్దీవుల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. అక్కడ వాళ్లు చేస్తున్న హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. గత కొద్దిరోజులుగా వారు చేస్తున్న ఫొటోలు మీడియాలో ప్రముఖంగా మారాయి.
న్యూ ఇయర్ వేడుకకు ముందు బీచ్ ఒడ్డున తెల్లటి బికినీలో దిశాపటానీ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఇది.
నూతన సంవత్సర వేడుకల కోసం మాల్దివుల్లో దిశా, టైగర్ ష్రాఫ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం (2 తేదీన) మరో ఫొటోను దిశా షేర్ చేశారు. నల్లటి బికినీలో ఈ ఫొటో కేక పుట్టిస్తున్నది.
ఇక జనవరి ఒకటో తేదిన టైగర్ ష్రాఫ్ తన సిక్స్ ప్యాక్ బాడీతో సముద్ర తీరాన్ని వేడెక్కించాడు. తన ట్విట్టర్ ఖాతో పోస్ట్ చేసిన ఈ ఫొటోను 632 మంది రీట్వీట్ చేయగా, 11 వేల మంది లైక్ చేశారు.
బాలీవుడ్ పత్రికల ప్రకారం దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవల మాల్దీవుల పర్యటనకు వెళ్తూ వీరిదర్దూ ముంబై విమానాశ్రయంలో మీడియా కంటపడ్డారు.
తాజాగా దిశా, టైగర్ ష్రాఫ్ భాగీ2 అనే చిత్రంలో నటిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సంబరాల అనంతరం వీరిద్దరూ భాగీ షూటింగ్‌కు హాజరువుతారని బాలీవుడ్ పత్రికల కథనం