Okka Kshanam Public Talk 'ఒక్క క్షణం' పబ్లిక్ టాక్..

Filmibeat Telugu 2017-12-28

Views 35

Directed by VI Anand, featuring Allu Sirish and Surabhi in the lead roles, Okka Kshanam, touted to be a scientific thriller is out on Thursday. The movie is receiving positive response from the audience.


ఒక్క క్షణం విడుదల వేళ.. అల్లు శిరీష్‌కు క్షణం.. క్షణం ఉత్కంఠ అనే చెప్పాలి. హీరోగా నాలుగేళ్ల కెరీర్ ఒక మోస్తరు హిట్‌కే పరిమితమవడంతో.. బ్లాక్ బస్టర్ కోసం అతను శాయశక్తులా కష్టపడుతూ వచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడా ఆ కష్టం ఫలించినట్లే కనిపిస్తోంది. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క క్షణంకు ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ రావడం విశేషం. ఒక్క క్షణంపై నెటిజెన్స్ అభిప్రాయాలు ఇప్పుడు చూద్దాం..
ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్ సూపర్బ్ అనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయని.. ఇది పక్కా హిట్టు బొమ్మ చెబుతున్నారు.
సినిమాలో సెకండాఫ్ బాగుందని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొంతమంది ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు.
దర్శకుడు విఐ ఆనంద్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందనే టాక్ వినబడుతోంది. నిర్మాణ విలువలు బాగున్నాయని, నటీనటులంతా బాగా పెర్ఫామ్ చేశారని అంటున్నారు. మొత్తంగా ఇటీవలి కాలంలో మంచి థ్రిల్లింగ్ మూవీ అని చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS