"Detective" Movie Public Talk "డిటెక్టివ్" పబ్లిక్ టాక్

Filmibeat Telugu 2017-11-10

Views 63

Detective movie story written and directed by Tamil Director Mysskin. The film is produced by Vishal, who also stars in the lead role. The film also features Prasanna, Andrea Jeremiah, Vinay and Anu Emmanuel amongst other actors.

తెలుగులో మంచు మనోజ్ నటించిన రాజుభాయ్ అనే చిత్రానికి కథను అందించిన తమిళ దర్శకుడు మిస్కిన్, తెలుగు ప్రేక్షకులకు పందెం కోడి లాంటి చిత్రాలతో రుచి చూపించిన విశాల్ కలిసి రూపొందించిన చిత్రం డిటెక్టివ్. తమిళంలో ముగమూడి లాంటి సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను అందించిన తాజాగా అదే జోనర్‌తో డిటెక్టివ్ చిత్రాన్నిరూపొందించారు. ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆర్థర్ కోనన్ డోయ్లే తీర్చిదిద్దిన షెర్లాక్ హోమ్స్ పాత్ర ఈ సినిమాకు ఇన్సిపిరేషన్. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న డిటెక్టివ్ చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అద్వైత భూషణ్ (విశాల్) నిజాయితీ కూడిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్. మనోహర్ (ప్రసన్న) అతని అసిస్టెంట్. కేసులు లేవని బాధపడుతున్న నేపథ్యంలో ఓ స్కూల్ విద్యార్థి తన పెంపుడు కుక్కను చంపినదెవరో తెలుసుకోవాలని అద్వైత భూషణ్‌ను కోరుతాడు. ఆ కేసు కూపీ లాగుతున్న క్రమంలో అనేక హత్యలు, నేరాలు అద్వైత భూషణ్ దృష్టికి వస్తాయి. హత్యలు చేసి వాటిని యాక్సిడెంట్స్‌గా నమ్మిస్తారు. ఆ హత్యల వెనుక డెవిల్ (వినయ్), భాగ్యరాజా, ఆండ్రియాతో కూడిన గ్యాంగ్ హస్తం ఉందని తెలుస్తుంది. వారందరూ హత్యలు ఎందుకు చేశారు. ఆ హత్యల వెనుక మిస్టరీ ఏమిటీ? ఇంకా ఈ చిత్రంలో సిమ్రాన్, అను ఇమ్యాన్యుయేల్ పాత్రలు ఏమిటనే ప్రశ్నలకు తెరపైన సమాధానమే డిటెక్టివ్ చిత్రం.
కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు విజృంభించిన విశాల్‌కు ఇది డిఫరెంట్ చిత్రం. ఈ చిత్రంలో లుక్ పరంగా, నటనపరంగా విశాల్‌లో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. డిటెక్టివ్ పాత్ర కోసం విశాల్ చేసిన కసరత్తు తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది.ఆండ్రియా జెర్మియా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించింది.
డెవిల్‌ పాత్రలో విలన్‌గా వినయ్ రాయ్ చాలా క్రూరంగా కనిపించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS