'అజ్ఞాతవాసి' మూవీ పబ్లిక్ టాక్..! 'Agnyaathavaasi' Movie Public Talk

Filmibeat Telugu 2018-01-10

Views 1

Agnyaathavaasi movie public talk : Pawan Kalyan and Trivikram Srinivas fail to create another magic

పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు మాటల్లో చెప్పలేనంత క్రేజ్. ఇక పవర్ స్టార్ సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. పవన్ కల్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జత కలిస్తే ఆ మ్యాజిక్ చెప్పలేం. వారిద్దరి కలయిక జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్లకు ప్రాణం పోసింది. తాజాగా పవన్, త్రివిక్రమ్ జోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనేందుకు అజ్ఞాతవాసి చిత్రంతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే..
విందా భార్గవ్ (బోమన్ ఇరానీ) ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఏబీ అనే సంస్థకు అధిపతి. భాగస్వాముల కుట్ర కారణంగా తన కుమారుడితోపాటు విందా భార్గవ్ చనిపోతాడు. దాంతో ఏబీ కంపెనీ బాధ్యతలు విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) చేతికి వస్తాయి. అయితే సీతారాం (ఆది పినిశెట్టి), శర్మ (మురళీ శర్మ) వర్మ (రావు రమేష్) అడ్డుపడుతారు. వీరందరిని ఎదుర్కోవడానికి ఎక్కడో అసోంలో ఉన్న బాలు అలియాస్ బాలసుబ్రమణ్యం (పవన్ కల్యాణ్)ను రప్పించుకొంటారు. ఇంద్రాణి కోరిక మేరకు రంగంలోకి దిగిన బాలు ఏ విధంగా పరిస్థితిని చక్కదిద్దారు? ఏబీ కంపెనీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి బాలుతో కలిసి ఇంద్రాణి ఏమి చేసింది. సీతారాం, శర్మ, వర్మలకు ఏ విధంగా బుద్ధి చెప్పింది. చిన్నస్థాయి ఉద్యోగిగా కంపెనీలోకి ప్రవేశించిన బాలు కంపెనీ సీఈవోగా మారేందుకు అభిషిక్త్ భార్గవ్‌గా ఎందుకు మారాడు? ఏబీ కంపెనీకి సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్), సుకుమారి (కీర్తి సురేష్) ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి చిత్ర కథ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS