ETV Prabhakar is mega star on the Telugu Television Industry. He played many roles on small screen. Now He becomes director for the Next Nuvve movie. This movie is released on November 3rd. In this occasion, Telugu Filmibeat brings you a exclusive review for readers.
టాలీవుడ్‌లో కామెడీ, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. చిన్న చిత్రాలుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హారర్ కామెడీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం నెక్ట్స్ నువ్వే. బుల్లితెర మీద మెగాస్టార్‌గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం బాధ్యతలు చేపట్టి రూపొందించిన నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్ వంశీ తదితరులు నిర్మించారు. రష్మీ గౌతమ్, ఆది సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ నటించిన చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నెక్ట్స్ నువ్వే చిత్రంలో కమెడియన్ల సంఖ్య భారీగానే ఉంది. కానీ రొటీన్ కామెడీతోనే సరిపెట్టారు. జయప్రకాశ్, రఘు, ఎల్బీ శ్రీరాం, రఘుబాబు ఇంకా చాలా మంది కనిపించారు. జయప్రకాశ్‌ది రొటిన్ రౌడీ పాత్ర. దయ్యాలను పారదోలే హైటెక్ మాంత్రికుడు ఆర్జీవి (రఘుబాబు) కనిపించాడు. ఆర్జీవి పాత్ర ద్వారా తనదైన కామెడీని పండించాడు.
నెక్ట్స్ నువ్వేలో రష్మీ గౌతమ్, వైభవి, హిమజ ప్రధాన పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ సోదరిగా రష్మీ కనిపించగా, వైభవి ఆది ప్రేయసిగా నటించింది. ఈ చిత్రంలో మరో కీలకపాత్రలో టీవీ నటి హిమజ కనిపించింది.