బంగారం మరియు పెట్రోల్ ధరలు : గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్ అప్ డేట్స్ !

Oneindia Telugu 2017-12-14

Views 32

Gujarat Elections Updates, Polling underway for Phase-II and today trending news. Gold rate and petrol price in major cities shown in video. 24 karat and 22 k gold rates here.

1.ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ టెస్టు సిరిస్‌ ఫిక్సింగ్ అయినట్లు వచ్చిన వార్తలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి
2. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. వేల కోట్ల బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొగ్గు గనుల స్కాం కేసులో ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా, ఆ రాష్ట్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ. గుప్తాతో సహా మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది.
3. పోలవరం ప్రాజెక్టుపై విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మిత్ర పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజయం సాధించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రంలోని బిజెపి సహకారం అవసరం. దీంతో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు.
4. ధోని అంటే అభిమానులకు ఎంత ఇష్టమో నిరూపితమయ్యే సంఘటన మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో చోటు చేసుకుంది. ఓ యువకుడు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మైదానంలోనికి దూసుకొచ్చాడు.ధోని కాళ్లకు నమస్కరించాడు. వెంటనే ధోని అతడిని లేపడంతో తన చేతిలో ఉన్న అట్ట ముక్క (సిక్సర్‌ను సూచించేది)పై ఆటోగ్రఫీ ఇవ్వాల్సిందిగా ధోనిని కోరాడు.
5. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్ చండ్రపుల్లారెడ్డి దళానికి చెందిన 8 మంది సభ్యులు మృతి చెందారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS