అదే నిజమైంది.. చిరంజీవి చిన్న అల్లుడు కూడా...! | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-09

Views 3

Chiranjeevi’s son in law and daughter Sreeja’s husband Kalyan is going to debut in Tollywood very soon. The film will be helmed by Rakesh Shashi who earlier directed the film ‘Jatha Kalise ‘.

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు వివాహం గతేడాది వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడైన కళ్యాణ్‌ను ఆమె పెళ్లాడారు. కళ్యాణ్ లుక్ పరంగా, పిజిక్ పరంగా హీరో పర్సనాలిటీకి ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో.... ఈ కుర్రాడు కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. ఇన్నాళ్లు ఒక పుకారుగానే ఉన్న ఈ వార్త ఇపుడు నిజం కాబోతోంది. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ త్వరలో సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. సినిమా కూడా ఖరారైంది.
కళ్యాణ్‌ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమాకు రాకేశ్‌ శశి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ దర్శకుడు ఇంతకు ముందు ‘జతకలిసే' అనే సినిమా చేశారు. ప్రేమకథా చిత్రంతో కళ్యాణ్ హీరోగా పరిచయం కాబోతున్నారట.
వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS