Pawan Kalyan Watches Rangasthalam Movie Along With His Wife

Filmibeat Telugu 2018-04-10

Views 2.3K

Pawan Kalyan watches Rangasthalam movie along with his wife, Ram Charan and Upasana. Pawan gives hint about success event

రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ సోమవారం తీరిక చేసుకుని రంగస్థలం చిత్రాన్ని వీక్షించాడు. రాంచరణ్, ఉపాసనతో కలసి సతీసమేతంగా పవన్ ఐమాక్స్ లో రంగస్థలం చిత్రాన్ని చూడడం విశేషం. దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాత కూడా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనసేన పార్టీని స్థాపించినప్పటికీ తన అన్న చిరంజీవితో, అయన ఫ్యామిలీతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలు లేవు అనే సంకేతాలని పవన్ అభిమానులకు ఇస్తున్నారు. ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు వేడుకల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
రంగస్థలం చిత్రం చూసాక పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. తాను తొలిప్రేమ చిత్రం తరువాత థియేటర్ కు వచ్చి చూసిన చిత్రం ఇదే అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాంచరణ్ అద్భుతంగా నటించాడని పవన్ ప్రశంసించాడు. నిర్మాత నవీన్ గొప్ప చిత్రాన్ని తీసారని అన్నారు. దర్శకుడు సుకుమార్ గొప్ప కథ, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టారని పవన్ కితాబిచ్చారు. రంగస్థలం చిత్రం తన మనసుకు విపరీతంగా నచ్చిందని పవన్ తెలిపారు.
చివర్లో పవన్ మాట్లాడుతూ ఫాన్స్ పండగచేసుకునే విషయాన్ని వెల్లడించారు. రంగస్థలం చిత్రం గురించి మిగిలిన విషయాలన్నీ తాను సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలపడం విశేషం. అంటే రంగస్థలం సక్సెస్ ఈవెంట్ జరగబోతున్న విషయం, తాను ముఖ్య అతిధిగా రాబోతున్నా విషయం పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. నిజంగానే ఇది మెగా ఫాన్స్ పండగ చేసుకునే విషయం అని చెప్పొచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS