Jana Sena chief and Power Star Pawan Kalyan meet DCI employees on Wednesday. He lashed out at Chandrababu Naidu government and PM Modi government and ys jagan
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రతి సమస్యకు తాను ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తానని చెబుతున్న విపక్ష నేతకు చురకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఆయన డీసీఐ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. అదే సమయంలో జగన్‌కు కూడా షాకిచ్చారు. వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారు. అంతకుముందు కూడా బహిరంగ సభల్లో మాట్లాడినా, మీడియాతో మాట్లాడినా తాను 2019లో ముఖ్యమంత్రి అవుతానని,అప్పుడు సమస్యలు పరిష్కరిస్తానని చెబుతూ వస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీనే కాకుండా కొందరు నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక చేస్తానని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.