AP Cabinet taken lot of key decesions on Friday meet here in Amaravathi under the presidentship of AP CM Chandrababu Naidu. Important decesion is that AP Cabinet taken decesion on Kapu Reservation.
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ముఖ్యంగా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. అంతకుముందు జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ కేబినెట్ సభ్యులకు తన నివేదిక అంశాల్ని వివరించింది.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. రేపు ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. అలాగే 2017-20 ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.