Hero Rajashekhar speaks About his wife Jeevitha's effort on the Movie "Evadaithe Nakenti" Direction
తెలుగులో మహిళా దర్శకురాళ్ళ సంఖ్య తక్కువే. జీవిత తెలుగు మహిళా రర్శకురాలిగా మారటం రాజశేఖర్ సినిమాలతోనే మొదలయ్యింది. తొలిసారి ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శేషు'. అయితే ఆ సినిమాని తమిళం లో వచ్చిన సేతు సినిమాకి మక్కీకి మక్కీ తీసినా పెద్దగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ఆ సినిమా నిరాశ మిగిల్చినప్పటికీ ఆ తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలు తీసింది. రాజశేఖర్‌కు లేక లేక ఓ విజయాన్నందించిన "ఎవడైతే నాకేంటి" సినిమాకు దర్శకులుగా సముద్రతో పాటు జీవిత పేరు కూడా పడటం తెలిసిందే. ఇద్దరూ కలిసి డైరెక్షన్ చేసారనే అంతా అనుకున్నారు ఇప్పటిదాకా...
అయితే ఇన్నాళ్ళకి ఒక విషయాన్ని బయటపెట్టాడు రాజశేఖర్. అసలు సముద్ర చేసిందేమీ లేదట. ఐతే సముద్ర పేరును ఏదో వెయ్యాలి కాబట్టి వేశామని.. నిజానికి ఈ సినిమా అంతా జీవితే తీసిందని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.