North Korea Defectors Reveal How They Were Forced To Impress Kim Jong-Un

Oneindia Telugu 2017-11-24

Views 2.8K

Three brave defectors who managed to escape the oppressive regime have revealed some of the “stupid questions” they are asked and the extreme lengths they go to ahead of a visit from the country's leader.

ఉత్తరకొరియాలో ప్రజల స్వేచ్చా హక్కులను కాలరాస్తున్న ఘటనలు.. వాటికి సంబంధించిన కథనాలు ఇటీవలి కాలంలో చాలానే వెలుగుచూశాయి. అమెరికాను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఢీకొట్టాలనుకోవడం తప్పా.. ఒప్పా.. అన్న సంగతి పక్కనబెడితే.. అక్కడి ప్రజల దుర్భర జీవితంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. కిమ్ ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఉత్తరకొరియా నుంచి దక్షిణకొరియాకు పారిపోవాలని చూసేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఓ సైనికుడు ఉత్తరకొరియా సైన్యం నుంచి తప్పించుకుని దక్షిణకొరియా లోకి పారిపోవడం అందరికీ తెలిసిందే. గతంలో అక్కడి నుంచి పారిపోయి దక్షిణకొరియాలో ఆశ్రయం పొందుతున్న బాధితులు ఆ దేశంలోని పరిస్థితులపై ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు.
ఉత్తరకొరియా నుంచి పారిపోయి వచ్చి దక్షిణ కొరియాలో ఆశ్రయం పొందుతున్న ముగ్గురు శరణార్థులు తాజాగా అక్కడి పరిస్థితులపై స్పందించారు. శరణార్థురాల్లో ఒకరు మాట్లాడుతూ.. ' మా ఇల్లు రైలు ట్రాక్ పక్కనే ఉండేది. అది ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేది. ట్రాక్‌పై ఉన్న ప్రతీ రాయిని బయటకు తీసి శుభ్రపరిచి తిరిగి అక్కడ పెట్టేవాళ్లు' అని ఆమె చెప్పుకొచ్చారు. అధ్యక్షుడి మెప్పు పొందడానికి ఇలాంటి పనులన్ని తమపై బలవంతంగా రుద్దేవాళ్లని ఆమె వాపోయారు. ఈ ఒక్క ఘటన చాలు ఉత్తరకొరియాలో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS