రామ్ చరణే ఆ సినిమా చెయ్యాలట !

Filmibeat Telugu 2017-11-24

Views 350

mega star chiranjeevi's block buster movie gang leader movie is planning to do with ram charan. some rumours are came that heros bunny and sai dharam tej will do this film. but they said ram charan only remake the movie.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమాల్లో ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఆయన కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ సినిమాలు ఉన్నాయి. అయితే అందులో చిరు కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన చిత్రాలలో గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. 1991 లో వచ్చిన ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ఉన్న టి-టౌన్ రికార్డులను ఆ సినిమా బద్దలు కొట్టింది అనే చెప్పాలి.
అయితే ఈ మధ్య కాలంలో ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అనే టాక్ బాగా వినిపిస్తోంది. నటిస్తే మెగా హీరోలే ఆ సినిమాల్లో నటిస్తారని ఓ క్లారిటీ కూడా అందరికి వచ్చేసింది. కానీ ఇప్పుడున్న మెగా యువ హీరోల్లో ఆ సినిమాను ఎవరు తీస్తారన్నది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని అడిగినప్పుడు మాత్రం ఆ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తేనే చాలా బావుంటుందని చెప్పాడు. అయితే ఆ తర్వాత మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా గ్యాంగ్ లీడర్ రాబోతోందని రూమర్స్ బాగానే వచ్చాయి కానీ దానిపై ఏ క్లారిటీ రాలేదు.
అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ జవాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా ఫెస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించారు. అయితే ఒక అభిమాని గ్యాంగ్ లీడర్ లో సినిమా ఎప్పుడు అని అడగ్గా.. సాయి.. గ్యాంగ్ లీడర్ చేస్తే చరణే చేయాలి నేను కాదు.. అని సింగిల్ లైన్ లో క్లారిటి ఇచ్చేశాడు. దీంతో గ్యాంగ్ లీడర్ వస్తే చిరు తనయుడి రూపంలో రామ్ చరణ్ చేస్తేనే వస్తుందని చెప్పొచ్చు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS