Sathyabama University Student Case, Watch: తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-23

Views 2

Angry students in Sathyabama University went on a violent rampage and set the university on fire after a batch mate committed lost life . The girl committed after she was caught cheating in the exam and was humiliated in front of her classmates.

చెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. రాగమౌనిక ఆత్మహత్య వెనుక యాజమాన్యంపై ఆరోపణలు రావడంతో వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం రాత్రి వర్సిటీ ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో బస్సులకు నిప్పు పెట్టారు. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోమవారం జరిగిన కెమిస్ట్రీ ఇంటర్నల్‌ పరీక్షల్లో రాగమౌనిక కాపీకి పాల్పడిందని యాజమాన్యం చెబుతోంది. ఆ కారణంగానే మంగళవారం కూడా ఆమెను పరీక్షకు అనుమతించలేదు. అందరి ముందే పరీక్ష హాల్ నుంచి ఆమెను బయటకి పంపించేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.సత్యభామ యూనివర్సిటీలో రాగమౌనిక కంప్యూటర్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాపీ కొట్టిందన్న కారణంతో పరీక్షలకు అనుమతించకపోవడంతో తిరిగి హాస్టల్ గదికి వెళ్లిపోయింది. గదిలో రాగమౌనిక ఒక్కరే ఉండటం.. తీవ్ర మనస్తాపం చెంది ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS