After 28 years, Nagarjuna, Ram Gopal Varma movie has repeated. Varma and Naga's new police cop movie started today at Annapurna Studios. First shot was picturised on Nagarjuna. After that Nagarjuna and Varma spoke to media.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శివ తర్వాత మళ్లీ రాంగోపాల్ వర్మ, నాగార్జున కలయికలో ఓ క్రేజీ కాంబినేషన్‌తో సినిమా మొదలైంది. ఈ రోజు (నవంబర్ 20 తేదీన) అన్నపూర్ణ స్టూడియోలో వర్మ, నాగ్ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రానికి వర్మ తల్లి తొలి షాట్ క్లాప్ కొట్టారు. 'నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన చెప్పకపోయినా నీవు చావడం మాత్రం ఖాయం. త్వరగా సమాధానం చెప్పి ముందు చస్తావో.. ఎక్కువ బాధపడి లేటుగా చస్తావో అది నీ ఇష్టం. ఏది కావాలో ఎంచుకో (చూస్) అని నాగార్జున ముహూర్తం షాట్‌కు డైలాగ్ చెప్పారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వర్మ, నాగార్జున మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జున ఎమోషనల్ అయ్యారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
నాకు మైండ్ దొబ్బలే. నా మైండ్ బాగానే ఉంది. నేను ఎప్పుడూ ఓ ఎక్సైట్ మెంట్ కోసం ఎదురు చూస్తాను. ఆ ఎక్సైట్‌మెంట్ ఈ రోజు మళ్లీ కనిపించింది. షూటింగ్ వెళ్లాలి అనే ఆతృత నాలో పెరిగింది. ఉదయం 4 గంటలకే లేచాను. లేచిన తర్వాత షూటింగ్ వెళ్లాలని త్వరగా తయారయ్యాను. రోజు ఇలా ఉంటే ఎంత బాగుండునో అని నాగార్జున అన్నారు.