Data released by NASA shows that even port city Kakinada in Andhra Pradesh also at a higher risk of flooding from rising sea levels because of melting glaciers than coastal cities such as Mumbai and New York.
రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత నగరం కాకినాడ కనుమరుగు కానుందా? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేసిన తాజా పరిశోధన ప్రకారం.. మన దేశంలో ముంబై, మంగళూరుతోపాటు కాకినాడకు కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తప్పదట.
ఈ మేరకు నాసా చేసిన హెచ్చరిక భారత తీర ప్రాంత నగరాలను వణికిస్తోంది. గ్లోబల్ వర్మింగ్(భూతాపం) కారణంగా అంటార్కిటికాలోని మంచు ఫలకాలు కరగడం వల్ల ప్రపంచంలోని 293 ప్రధాన పోర్టు నగరాలకు ముప్పు వాటిల్లనుందని నాసా టూల్ కిట్ జీఎఫ్‌ఎం ద్వారా వెల్లడైంది.
మన దేశంలో అయితే.. మహారాష్ట్రలోని ముంబయి, కర్ణాటకలోని మంగళూరుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తదితర తీర ప్రాంతాలకు ఎక్కువ ముప్పు ఉన్నట్లు నాసా పరిశోధన వెల్లడించింది. ఇప్పటికే కాకినాడలోని ఉప్పాడలో సముద్రం ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించిన ఈ అధ్యనం వివరాల్లో... భారత తీర ప్రాంత నగరాలకు ముప్పు వెంటనే రావచ్చు లేదా ఆలస్యంగా రావచ్చు. కానీ, ఎప్పటికైనా ముంపు ప్రమాదం తప్పదని నాసా పేర్కొంది.