CM CKR vs Kodandaram : New Political Party In Telangana | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-11

Views 650

Telangana Joint Action Committee chairman Prof M Kodandaram is getting ready to launch a new political party in Telangana to fight the 2019 elections with a view to pull down the Telangana Rashtra Samithi from power.

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరాం సొంతంగా పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. 2019 అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల్లో అధికారం నుంచి టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని ఆయన తలపోస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం నూతన పార్టీ స్థాపించేందుకు అనువైన వ్యూహ రచనలో కోదండరాం నిమగ్నమయ్యారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన కోదండరాంకు ఆయన బలం, బలహీనతలేమిటో తెలుసు. సీఎం కేసీఆర్‌కు కూడా కోదండరాం పరిమితులు తెలియనివి కావు. అయితే కేసీఆర్ మాదిరిగానే కోదండరాం కూడా పట్టువదలని విక్రమార్కుడనడం అతిశయోక్తి కాదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS