చైనా-భారత్ కు హానికరం: అమెరికా హెచ్చరిక | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-09

Views 2.1K

The recent decision by China to block a bid at the United Nations to list Maulana Masood Azhar, chief of Pakistan-based Jaish-e-Mohammed (JeM) militant group, is doing "material harm" to its ties with India, top American experts said on Tuesday.

జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్‌పై బీజింగ్ తీరు భారత్- చైనా మధ్య సంబంధాలకు ఏమాత్రం మంచిది కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడ్డారు. అజహర్‌పై చైనా తీరు మారాలని అంటున్నారు.
పాకిస్తాన్‌లో తలదాచుకున్న అజహర్ విషయమై ఐక్య రాజ్య సమితిలో చైనా తీరు ఏమాత్రం కాదని అంటున్నారు. చైనా తీరు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, మసూద్‌ అజహర్‌ను భద్రతా మండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చేసే ప్రయత్నాలను చైనా నాలుగోసారి అడ్డుకున్న నేపథ్యంలో అమెరికా.. భారత్‌కు మళ్లీ మద్దతు పలికింది.
అజహర్‌ను చెడ్డ వ్యక్తిగా పేర్కొన్న అమెరికా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిదేనని పేర్కొంది. అజహర్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చైనా ఎందుకు అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని అమెరికా విదేశాంగ శాఖ నిలదీసింది.
అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు శాశ్వత సభ్యత్వ దేశాలు సుముఖంగా ఉన్నా ఐరాస భద్రతామండలి ఆంక్షల కమిటీలో వీటో అధికారంతో చైనా అడ్డుపుల్లలు వేస్తోంది. గత వారం కూడా చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS