యుద్ధానికి సిద్ధం అవుతున్న చైనా : భారత్‌తోనేనా?

Oneindia Telugu 2017-11-04

Views 1

Chinese President, Xi Jinping has instructed his armed forces to be prepared for everything. He said that the army must improve its combat capabilities and readiness.
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేశారు. యుద్ధానికి ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాలని తమ దేశ సైన్యానికి జీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. పోరాడే సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించడం గమనార్హం.
శుక్రవారం అత్యున్నత సైనిక అధికారులతో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి గెలవాల్సిన యుద్ధాలకు సైన్యాన్ని సిద్ధం చేయాలని మిలటరీ కమిషన్‌ను ఆదేశించారు.
దాదాపు 23లక్షల చైనా సైన్యానికి సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ నేతృత్వం వహిస్తోంది. ఈ కమిషన్‌ మొత్తంలో జిన్‌పింగ్‌ ఒక్కరే సైనికేతర సభ్యుడు. ఆయనే ఈ కమిషన్‌కు అధ్యక్షుడు కూడా. ఆర్మీతో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జిన్‌పింగ్‌ రెండోసారి అధికారం చేపట్టాక యుద్ధానికి సిద్ధమవ్వాలని చెప్పడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చైనా కమ్యూనిస్టు పార్టీలో దివంగత మావో తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్‌ గుర్తింపు పొందారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS