JAC chairman Kodandaram's deeksha : త్యాగధనులను మరిస్తే మట్టిగొట్టుకుపోతారు..

Oneindia Telugu 2017-11-02

Views 73

Professor Laxman speech Telangana JAC chairman Kodandaram's deeksha at Kodandaram's house. Watch Video For his Speech

కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపణలు చేస్తూ మరో ఉద్యమానికి ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమయ్యారు. పోరాటంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించటానికి పూనుకొన్నాడు. కానీ సభ నిర్వహించుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయనను పోలీసులు అడ్డుకొన్నారు. దాంతో బుధవారం తార్నాకలోని తన నివాసంవద్దనే ఆయన ధర్నాకు కూర్చున్నారు.పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా పౌరహక్కుల కోసం కోదండరాం పోరాటం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజల కోసం కోదండరాం పనిచేస్తున్నారు కాబట్టే ఆయన ధర్నాను అడ్డుకొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడినా సభ నిర్వహించుకొనే హక్కు లేకుండా పోతున్నది. ప్రజా పోరాటలకు కేసీఆర్ ప్రభుత్వం ఎదురు తిరిగితే ప్రజలు వారిని ఇంటికే పంపడం ఖాయం. ప్రజలంతా ప్రత్యామ్నాయంకోసం ఎదురు చూస్తున్నారు అని ఆయన అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని మరిచిపోతరేమో కాని కోదండరాం లాంటి వీరులను ప్రజలకు ఎప్పటికీ మరువరు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన మొదటి పని ఏంటంటే పోలీసులకి అపరిమితమైన అధికారం ఇవ్వడమే. ప్రజలకు స్వేచ్చ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. పోలీసులకు ఆధునిక వాహనాలు ఇచ్చాడు. ఆయుధాలు ఇచ్చాడు. ,పౌరహక్కులను మంటగలుపుతున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడు అంటూ లక్ష్మణ్ దుయ్యబట్టారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలను చేసిన వారిని విస్మరిస్తే మట్టి గొట్టుకుపోతారు అంటూ హెచ్చరించారు.

Share This Video


Download

  
Report form