Telangana Art Teachers protest against unemployment in Telangana state on Wednesday.
టీ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో ఆందోళన
తెలంగాణ ఆర్ట్ టీచర్స్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ తార్నాకలోని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం ఇంటి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. నిరుద్యోగ ఆర్ట్ టీచర్లను ఆదుకోవాలని, డీఎస్సీలో ఆర్ట్‌ను చేర్చాలని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ ఆర్ట్ టీచర్స్ నిరుద్యోగుల సంఘం తరఫున వారు నిరసన చేపట్టారు.
తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ఆచార్య కోదండరాం తార్నాకలోని తన ఇంట్లో మంగళవారం 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సాగుతున్న ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని మండిపడ్డారు.జేఏసీపై ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే ఈ ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ, నిర్బంధ వైఖరికి నిరసనగా దీక్షను చేపట్టానన్నారు. కొలువులకై కొట్లాట సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించిన దీక్షను బుధవారం మూడు గంటలకు ముగిస్తారు.