సూపర్‌స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా(భరత్ అను నేను) సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావించారు. 2018 సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగు మధ్యలో కొన్ని ఆటంకాలు రావడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత దానయ్య డి.వి.వి ఒక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27, 2018లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందన్నారు.
నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ''నవంబర్ 7 వరకు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. మహేష్, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.