Young Tiger Jr NTR’s ‘Jai Lava Kusa’ and Mass Maharaj Ravi Teja’s ‘Raja The Great’ have coincindetally got similar ratings. Both the films were aired on television on th eve of Sankranthi festival and both the movies got 17.7 TRP.
2018 సంక్రాంతి సందర్భంగా వెండితెరపై పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', బాలయ్య 'జై సింహ' పోటీ పడ్డ సంగతి తెలిసిందే. వీటితో పాటు సూర్య నటించిన డబ్బింగ్ మూవీ 'గ్యాంగ్' బరిలో నిలిచాయి. వెండితెరకు సంబంధించిన పోటీలో విజేత బాలయ్యే అని తేలిపోయింది. అయితే బుల్లితెరపై కూడా ఈ సంక్రాంతికి మరో నందమూరి హీరో విజయఢంకా మ్రోగించారు. 2018 సంక్రాంతికి బెల్లితెరపై ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ', మహేష్ బాబు మూవీ ‘స్పైడర్', రవితేజ ‘రాజా ది గ్రేట్', శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు' చిత్రాలు పోటీ పడ్డాయి. మహేష్ బాబు ‘స్పైడర్', జూ ఎన్టీఆర్ ‘జై లవ కువ' చిత్రాలు 2017 దసరా సీజన్లో బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. ఆ సమయంలో తారక్ నటించిన ‘జై లవ కుశ' చిత్రం విజేతగా నిలవగా, ‘స్పైడర్' మూవీ భారీ నష్టాలు మూటగట్టుకుని అట్టర్ ప్లాప్ అయింది.
స్పైడర్' మూవీ ప్లాప్ టాక్ రావడంతో వెండితెరపై ఎవరూ చూడలేదు. మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని బుల్లితెరపై ఎక్కువ మంది చూస్తారని అంచనా వేశారు. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. బుల్లితెరపై కూడా ఈ చిత్రం పెద్ద ప్లాప్ అని తేలి పోయింది. స్పైడర్' మూవీ బెల్లితెరపై దారుణమైన రిజల్ట్స్ నమోదు చేసింది. కేవలం 6.7 రేటింగ్ రాడంతో బుల్లితెరపై కూడా డిజాస్టర్ అయి తేలిపోయింది
జై లవ కుశ' మూవీ సంక్రాంతికి టీవీలో ప్రదర్శించగా 17.7 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తారక్ కెరీర్లోనే ఇది సెకండ్ హయ్యెస్ట్ రేటింగ్. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్' 20.69 రేటింగ్ సాధించింది. తారక్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్.