Skipper Virat Kohli and Rohit Sharma hit centuries as India thrashed Sri Lanka by 168 runs in the fourth one-day international to take a 4-0 lead in the five-match series in Colombo on Thursday. Winning the toss, India posted 375 for 5 at the R. Premadasa stadium
శ్రీలంక పర్యటనలో టీమిండియా ఎదురే లేకుండా పోయింది. వరుసగా నాలుగో వన్డేలో కూడా విజయం సాధించింది. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేయడానికి అడుగు దూరంలో నిలిచింది. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చెలరేగి ఆడటంతో భారత్ 168 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలతో చెలరేగగా, చివర్లో మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు), ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు.