former India cricketers Ajit Agarkar and VVS Laxman felt that it is time to look ahead and give youngsters an opportunity in the shortest format of the game. Former India opener Aakash Chopra went a step ahead and have suggested to drop Dhoni for the upcoming T20Is against Sri Lanka before India go on to play South Africa, which will be a tough tour in December.
టీ20ల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు సూచించిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ధోని నెమ్మదిగా ఆడుతున్నాడని.. వెంటనే తప్పుకోని యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో క్రికెటర్ చేరాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటనను దృష్టిలో ఉంచుకోని శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ధోని స్ధానంలో మరొకరిని జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలక్టర్లకు సూచించాడు. ఓ స్టోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక భారత్‌లో అడుగుపెట్టింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 20న తొలి టీ20 జరగనుంది' అని చోప్రా అన్నాడు.