Kathi Mahesh Lashes out at YS Jagan And Chandrababu

Oneindia Telugu 2017-08-30

Views 70

Telugu film critic Kathi Mahesh reviewed on Andhra Pradesh and Telangana political situations
ఇప్పటికే ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే పవన్ రాజకీయ ప్రవేశంపై వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఏపీ ఓటర్లు ప్రస్తుతం చాలా గందరగోళంలో ఉన్నారని కత్తి మహేష్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఉందని అన్నారు. ప్రజలకు చంద్రబాబు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారన్న కత్తి మహేష్.. ఆ అరచేతిలో స్వర్గం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS