The former captain ‘cool’ scored 67 and remained unbeaten till the end to pick up the winning run once again in the chase. Dhoni remained not out for the 121st time in his One-Day International career and 40th time in successful ODI chases. The 36-year-old backed his calm innings in the second ODI with yet another composed one which saw India chase a tricky total comprehensively
గత కొన్నేళ్లుగా భారత జట్టు తరుపున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్‌లను విజయవంతంగా ముగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నో మ్యాచ్‌ల్లో తనదైన శైలిలో విన్నింగ్ షాట్‌లు కొట్టి నాటౌట్‌గా నిలిచి జట్టుకి విజయాలు అందజేశాడు. అలాంటి ధోనిపై శ్రీలంక సిరిస్‌కు ముందు మాజీ క్రికెటర్లతో పాటు క్రీడా విశ్లేషకులు సైతం విమర్శలు కురిపించారు. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ధోని తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. తాజాగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో వన్డేల్లో ధోని 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.