Allu Arjun Father In Law Went Gandhi Bhavan And Met Deepa Das Munshi : తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని హీరో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌లో కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, దీపాదాస్ మున్షీ ఉన్నారన్న సమాచారంలో ఆయన గాంధీభవన్ వెళ్లారు. కానీ ఆయన వచ్చిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో ఉన్నందున దీపాదాస్ మున్షీని కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డికి కాల్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డికి దీపాదాస్ మున్షీతో అంతగా పరిచయం లేకపోవడంతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు.