పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ అగ్రెసివ్ స్పీచ్!

Oneindia Telugu 2018-04-23

Views 67

Allu Arjun Aggressive Speech about Pawan Kalyan at Naa Peru Surya Na Illu India movie Audio Launch.Mega Producer Naga Babu Emotional Speech at Naa Peru Surya Na Illu India Audio release event.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.
అరవింద్ గారితో ... వీడు మంచోడు, అమాయకుడు మీరు ఎవరూ ఊహించని ఎత్తుకు వెళతాడని చెప్పాను. అపుడు నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడో కాదు... ఎంత మంచి వాడు? ఎంత నిజాయితీ గలవాడు? అది ఉన్నవాడు టాప్ రేంజికి ఎదగలడు. అందుకు ఉదాహరణ బన్నీ.... అని నాగబాబు తెలిపారు.
నా అన్నయ్య తర్వాత నా తమ్ముడు నాకు ఎంతో గొప్ప.మా తమ్ముడు వీళ్లందరి దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకోకండి, పవన్ కళ్యాణ్ వెనకాల చాలా మంది ఉన్నారు. ప్రజా జీవితంలోకి నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తున్నాం.ఎలా చేయాలో మాకుతెలుసు. ఒక సారి కుదరలేదు(చిరంజీవి సమయంలో)...ఈ సారి కుదిరి తీరుద్ది. ఒక్కొక్కడికి ఉంటదిక..... అంటూ నాగబాబు ఆవేశంగా మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS