Pawan Kalyan Lays Foundation Stone for Roads Construction: గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకే రహదారుల నిర్మాణం చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన పవన్ కల్యాణ్ రోడ్ల నిర్మాణానికి, పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.